శివకుమార్‌ విడుదల

శివకుమార్‌ విడుదల

న్యూఢిల్లీ:తీహార్ చెరసాల నుంచి విడుదలైన అక్రమ నగదు బదిలీ కేసుల్లో నిందితుడైన కర్నాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే. శివ కుమార్ గురువారం ఇక్కడి పార్టీ నేతలతో మంతనాలు జరిపిన తర్వాత స్వస్థలం బెంగళూరుకు శుక్రవారం వెళ్లనున్నారు. రూ.25 లక్షల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, విదేశాలకు వెళ్లకుండా షరతులతో ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆయనకు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. బుధ వారం రాత్రి 9.30 గంటలకు చెరసాల నుంచి విడుదలైన తర్వాత విలేఖరులతో మాట్లాడారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్య వాదాలు తెలి పారు ‘మీ అందరి మద్దతు, ఆశీర్వాదంతో నాకు ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. మా పార్టీ నేతలు వెన్నంటి నిలిచారు. దేశ వ్యాప్తంగా ఉన్న మా పార్టీ నేతలకు రుణపడి ఉంటాను. నేను తిరిగొచ్చాను. కష్టసమయాల్లోనాకు తోడుగా నిలిచినందుకు మీకు రుణపడి ఉంటాను. ముఖ్యంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పాలి. ఆమె నన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు’ అని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos