దిశ రవి కేసులో కేంద్రాన్ని ఎండ గట్టిన పత్రికలు

దిశ రవి కేసులో కేంద్రాన్ని ఎండ గట్టిన పత్రికలు

న్యూ ఢిల్లీ : దేశంలోని ప్రముఖ ఇంగ్లీష్ వార్తా పత్రికలు యువ పర్యావరణ కార్యకర్త దిశారవి అరెస్ట్ పై కేంద్రం ఏకపక్షంగా, అనైతికంగా, రహస్యంగా వ్యవహరించిన తీరును తమ సంపాదకీయాల్లో ఎండగట్టాయి. మూడు అంశాలను ప్రధానంగా చర్చించాయి. ఒకటి.. డిజిటల్ ప్రచారంలో కీలకంగా ఉన్న టూల్కిట్లు గురించి ఢిల్లీ పోలీసులకు తెలియదా, లేదంటే అర్థం చేసుకోలేదా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఉద్యమంపై ప్రపంచ వ్యాప్తంగా మద్దతు సమీకరణకునిరసనకారులు న్యాయ సమ్మతితో కూడిన పత్రాలతో సమానంగా విశ్వసిస్తుంటారు. రెండు. దిశారవి అరెస్ట్ విషయంలో ఢిల్లీ పోలీసులు పలు నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబట్టాయి. బెంగళూరులోని ఆమె నివాసం నుంచి స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఢిల్లీ పోలీసులు ఎలా అరెస్ట్ చేశారని, స్థానిక మెజిస్ట్రేట్ ఎలా సహకరించారని ప్రశ్నించారు. అంతర్ రాష్ట్రాల అరెస్ట్లకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించడం, బాధితులు న్యాయ సలహాను తీసుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం, ఆమెను పోలీసు కస్టడీకి అనుమతించాలని కోరడాన్ని వ్యతిరేకించాయి. మూడు. ప్రస్తుత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఉన్న ఇమేజ్ గురించి వాస్తవంగా అంత ఆందోళన చెందుతుంటే.. నిరసన చేస్తున్న రైతులకు మద్దతునిస్తున్న వారితో తమ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావిస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా కూడ గట్టిన పలు కార్యకర్తల సమూహం వినియోగిస్తున్న సందేశాలను అనుసరించడం మానుకోవాలి.టూల్కిట్ హానికరం కాదు: అనాగరికంగా వ్యవహరించి ఒక సాధారణ న్యాయవాదిపై కుతంత్రంగా కేసు నమోదు చేసిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకీయం కేంద్రాన్ని విమర్శించింది. పబ్లిక్ డొమైన్లో కూడా ఢిల్లీ పోలీసులకు ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ.. ఆయుధాలను కలిగి ఉందన్న న్యాయవాద పత్రం ఏమిటని ప్రశ్నించింది.ఈ అభిప్రాయానికి అనుగుణంగా హిందూ సంపాదకీయం పేర్కొంది. ఆన్లైన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు ఈ టూల్కిట్లను వినియోగించడం సర్వసాధారణమని, వాటిలో నిరసనలు, ట్వీట్ చేయాల్సిన విధానాలు, హ్యాష్టాగ్లు, అధికారులకు, కార్యకర్తలకు, ప్రజలకు పేర్లు సూచిస్తూ.. హ్యాండిల్ ట్యాగ్ చేయబడ తాయని తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించిన హానికరం కాని పత్రం అని.. ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి ఢిల్లీ పోలీసులే కారణమని పేర్కొంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హిందుస్థాన్ టైమ్స్ పలు ప్రశ్నలను సంధించింది. ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పాలించడాన్ని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దిశారవిని అరెస్ట్ చేసిన అనంతరం పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసిన తీరును ఎండగట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన కేసులను న్యాయ స్థానాలు మరింత కఠినంగా వ్యవహరించాలని.. బెయిల్కు అవకాశం ఉన్నప్పుడు ప్రజలను జైలుకు పంపకూడదని పేర్కొంది. పెరుగుతున్న జాతీయ వాదంతో ఇప్పటికే అప్రతిష్ట పాలైన భారత ఇమేజ్కు ఈ అరెస్ట్ ఎలా సహకరిస్తుందని హిందుస్తాన్ టైమ్స్ ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ఖలిస్తానీ పాత్ర ఉందని ఆరోపణలు గుప్పించడం గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతుంటే.. కార్యకర్తలపై కేసులు బనాయించడం ద్వారా ఇదిసాధ్యం కాదని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎద్దేవా చేసింది. ఈ చర్య భారతదేశ అంతర్జాతీయ స్థితిపై తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని హిందూ పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos