దిగ్విజయ సింగ్, శివకుమార్ అరెస్టు

దిగ్విజయ సింగ్, శివకుమార్ అరెస్టు

బెంగళూరు : మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పరిరక్షించాలనే కోరికతో ఇక్కడి రమదా హోటల్లో బస చేసిన తిరుగుబాటు శాసనసభ్యుల్ని బుధవారం కలుసుకునేందుకు వెళ్లిన, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్,కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధ్యక్షుడు డి.కె.శివకుమార్ను పోలీసులు అరెస్ట్ చేసారు. హోటల్ లో మకాం చేసిన 21 మంది ఎమ్మెల్యేలను కలుసు కునేందుకు వెళ్లిన వారిని హోటల్ సమీపంలో పోలీసులు అడ్డు కోవటంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అమృతహళ్లి పోలీసు ఠాణాకు వారిద్దరినీ తరలించారు. అంతకు ముందు దిగ్విజయ్ విలేఖరులతో మాట్లాడారు. ‘నేను రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. 26న ఎన్నికలు జరుగనున్నాయి. మా ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేసారు. వారితో మాట్లాడాలని వచ్చా. అక్కడున్న వారిలో ఐదు గురు నన్ను రమ్మ న్నారు.కలుసుకునేందుకు పోలీసులు అడ్డుకున్నానరు. నా వద్ద మారనాయుధాలు ఏవీ లేవు. ఒంటరిగా ననున్న లోపలికి పంపేందుకు వారికి ఎందుకు అభ్యంతరం. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారనే తాను భావిస్తున్నా. మా ఎమ్మెల్యేలను ఇక్కడ నిర్బంధించార’ని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos