మంచు విష్ణుపై దర్శకుడి ఆరోపణలు..

  • In Film
  • May 3, 2019
  • 138 Views
మంచు విష్ణుపై దర్శకుడి ఆరోపణలు..

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు మానసికంగా
వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓటర్‌ చిత్ర దర్శకుడు కార్తిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు
తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.ఎలాంటి సంబంధం లేకపోయినా ఓటర్‌ కథను మోహన్‌బాబు
నటించిన ఒకప్పటి చిత్రం అసెంబ్లీ రౌడీ చిత్రంతో ఓటర్‌ చిత్రాన్ని అడాప్ట్‌ చేయడానికి
మంచు విష్ణు, విజయ్ కుమార్ రెడ్డిలు తనను బెదిరించి బలవంతంగా
తప్పుడు అగ్రిమెంట్ చేయించుకున్నారని..
ఆరోపించారు.ముందుగా ‘పవర్ ఫుల్’ అనే కథను  రాసుకొని ఓటర్ సినిమా తీశానని, ఆ కథను రచయిత సంఘంలో రిజిస్టర్ కూడా
చేయించినట్లు చెప్పారు. ఆ కథ నచ్చడంతో మంచు విష్ణు  నటించడానికి ఒప్పుకున్నట్లు
చెప్పారు. ఆ తరువాత సినిమా పేరుని ‘ఓటర్’గా మార్చినట్లు చెప్పారు.
షూటింగ్ దశలో కూడా కొన్ని సీన్లు మార్చాలని విష్ణు
తనపై ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారని, తనకు
స్వేచ్చ ఇవ్వకుండా ప్రతీ
విషయంలో జోక్యం చేసుకునేవారని చెప్పుకొచ్చారు కార్తిక్
రెడ్డి.సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో మంచి పేరు వస్తుందని భావించి
కథ, స్క్రీన్ ప్లే క్రెడిట్స్ తనకు
ఇవ్వాలని మంచు విష్ణు డిమాండ్ చేశాడని, ఒప్పుకోకపోయేసరికి
బెదిరించినట్లు దర్శకుడు చెప్పారు. ఆయన బెదిరింపులు తట్టుకోలేక
స్క్రీన్ ప్లే రైటర్ గా మంచు విష్ణు పేరు వేసినట్లు వెల్లడించారు
కార్తిక్ రెడ్డి. విష్ణు కారణంగా మానసిక క్షోభ అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.ఇప్పుడు
సినిమాను విడుదల కానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన
వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన విజయ్
కుమార్ రెడ్డి ‘అసెంబ్లీ రౌడీ’ స్క్రీన్ ప్లే వాడుకున్నందుకు దర్శకనిర్మాతలు
కలిసి ఒప్పందం రాసుకున్నారని, దానికి
కొంత మొత్తం కూడా చెల్లిస్తానని దర్శకుడు
చెప్పినట్లు విజయ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు 
డబ్బు గురించి అడిగేసరికి కట్టుకథలు
చెబుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos