ప్రభుత్వాల్నికూల్చటమే కేంద్రం పని

ప్రభుత్వాల్నికూల్చటమే కేంద్రం పని

పుదుచ్చేరి: రాజీనామాలు చేయక పోతే కేంద్ర సంస్థల విచారణను ఎదు ర్కోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అమిత్షా తమ శాసనసభ్యుల్ని బెదరించినట్లు పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పాండిచ్చేరిలో కాంగ్రెస్ సర్కార్ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీనికి ముందే సర్కార్ను కూల్చేయాలని బీజేపీ ఈ చర్యలకు పాల్ప డిందని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు దినేష్ గుండూరావు ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కైన ప్రభుత్వాలను అస్థిరపరచడమే బీజేపీ పనిగా పెట్టుకుంది. ఇందుకోసం దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతూ అనైతిక చర్యలకు పాల్పడుతోంది. ఏమి చేసైనా సరే విపక్ష పార్టీలను అస్థిరపరచాలన్నదే వారి లక్ష్యం. ఈడీ, సీబీఐలను ఎగదోసి పదవులను వదులుకొమ్మంటూ ఎమ్మెల్యేలను బెదిరిస్తోంద’ని ఆరోపించారు. ‘అమిత్షా వ్యక్తిగతంగా కొందరు ఎమ్మెల్యేలను పిలిపించి వారిని బెదిరించారు. బీజేపీ మాట వినకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ భయంతో కొందరు ఎమ్మెల్యేలు పదవులు వదులుకున్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తోంది’ అని గుండూరావు ఆరోపించారు. పార్టీలో అభిప్రాయభేదాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయాన్ని అంగీకరించారు. వారితో రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి, పార్టీ వీడకుండా ఉండేలా నచ్చజెపుతున్నారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos