కాంగ్రెస్‌కు సీతక్క షాకిస్తుందా?

కాంగ్రెస్‌కు సీతక్క షాకిస్తుందా?

తెలంగాణలో ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఉనికినే కోల్పోయే దిశగా పయనిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పక్షంలో విలీనమైనా కాంగ్రెస్‌ నుంచి తెరాసలోకి వలసలకు మాత్రం బ్రేక్‌ పడే సూచనలు కనిపించడం లేదు.తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా తెరాస వైపు చూస్తున్నట్లు సమాచారం.గతంలో తెదేపాలో ఉన్న సమయంలో ఎర్రబెల్లి దయాకరరావు సహకారంతో జిల్లా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న సీతక్క ఎర్రబెల్లి తెరాసలో చేరాక రేవంత్‌ సహకారంతో తెదేపాలో నెట్టుకొచ్చారు.అయితే కొన్ని అనూహ్య, అనివార్య పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో సీతక్క కూడా కాంగ్రెస్‌లో చేరారు.గత ఊఏడాది జరిగిన ఎన్నికల్లో ములుగు నుంచి పోటీ చేసి మాజీ మంత్రి చందూలాల్‌పై విజయం సాధించిన సీతక్క త్వరలో తెరాసలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులు,నియోజకవర్గ ప్రజలు,నేతల ఒత్తిడి కారణంగా తెరాసలోకి చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.అందులో భాగంగా వరంగల్‌ నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా తెరాస అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే మరో పది రోజుల్లో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos