పనసపొట్టుతో మధుమేహానికి చికిత్స

పనసపొట్టుతో మధుమేహానికి చికిత్స

శ్రీకాకుళం :మధుమేహ వ్యాధిగ్రస్తులకు పనసపొట్టు పిండి అద్భుతమైన ఔషధమని  శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ తమ పరిశోధనలో తేలింది. ఇది రోగుల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా అదుపు చేస్తుందని నిర్ధారించింది. ఈ పరిశోధన ఫలితాలను జాక్‌ఫ్రూట్‌ 365 సంస్థ మీడియాకు వెల్లడించింది. 18- 60 ఏళ్ల వయసున్న మధు మేహానికి మందులు వాడుతున్నవారిపై పరిశోధన చేసారు. మొత్తం 40 మందిని రెండు గ్రూపులుగా విభజించారు.  ఒక గ్రూప్‌ లోని వారికి రోజూ 30 గ్రాముల పచ్చి పనస పొట్టు పిండిని 12 వారాలు అందించారు. మరో గ్రూప్‌ లోని వారికి ఇదే బరువున్న ఇతర పిండి తరహా పదార్థాన్ని అందించారు. ఆ వ్యవధిలో రక్తంలో గ్లూ కోజ్‌ స్థాయిలు, పీపీజీ, కొవ్వుల స్థాయులు, బరువు పెరుగుతున్నారా, ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? వంటివి పరిశీలించారు. మొత్తంగా పనస పొట్టు పిండిని వాడినవారిలో మధుమేహం బాగా నియంత్రణలో ఉన్నట్టు గుర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos