కన్యాదానం లేదు.. అప్పగింతలూ లేవు

కన్యాదానం లేదు.. అప్పగింతలూ లేవు

ముంబై: నటి దియా మీర్జా(39) వివాహంలో రెండు తంతులు –కన్యా దానం, అప్పగింతల్ని లేవు. ఈ నెల 15న వ్యాపారి వైభవ్ రేఖితో ఆమె పెళ్లి జరిగింది. ‘19 ఏళ్లుగా రోజూ పొద్దున్నే నేను గడిపే తోటలోనే నిరాడంబరంగా పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉంది. పెళ్లిలో ప్లాస్టిక్ ను అస్సలు వాడలేదు. పర్యావరణ హితంగా పెళ్లి జరిగింవొ. సహజసిద్ధమైన సామగ్రినే అలంకరణ కోసం వాడాం. వైదిక సంప్రదాయానుసారం మహిళా పూజారి పెళ్లి జరిపించారు. చిన్ననాటి స్నేహితురాలు అనన్య పెళ్లికి వెళ్లేంత వరకు ఓ మహిళ పెళ్లి చేయిస్తుందన్న విషయం తెలియదు. ఆమె నా స్నేహితురాలి అత్త షీలా. నా పెళ్లికీ ఆమెను పంపించి అనన్య మంచి కానుక ఇచ్చింది. ఇంతకు మించి గొప్ప గౌరవం ఏముంటుంది. మహిళలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. పుట్టుక కొత్తది. , పాత విషయాలను కొత్తగా నిర్వచించే ప్రయత్నం చేయాలి. నా పెళ్లిలో కన్యాదానం, అప్పగింతలు లేవు. మార్పు అనేది మన ఎంపికతోనే మొదలవుతుంది. ఆడ, మగ ఇద్దరూ సమానమేన’ని సామాజిక మాధ్యమంలో రాసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos