మమత సర్కార్‌పై మళ్లీ గవర్నర్ నిప్పులు.

మమత సర్కార్‌పై మళ్లీ గవర్నర్ నిప్పులు.

కోల్కతా: ‘టీఎంసీ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించింది. హింస చోటుచేసుకున్న ప్రాంతాల్లో పర్యటించను’న్నట్టు గవర్నర్ జగ్దీప్ ధన్కర్ సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘రాజ్యాంగ బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలోని బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నేను నిర్ణయించాను. ఇందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని అడిగాను. ప్రభుత్వ స్పందన తగినట్లు లేదు. ముందుగా అనుకున్న ప్రకారమే సొంత ఏర్పాట్లతో రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాన’ని ధన్కర్ వివరించారు. ‘ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రతీకార హింస, దహనకాండలు, లూటీలు, బెదరింపులు వంటివి వేదనకు గురి చేస్తు న్నాయి. ప్రభుత్వం విశ్వసనీయతను పునరుద్ధరించి, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్న దుండగులను వెంటనే చట్టం ముందు నిలబెట్టాలి. మీ ఓటే మీ మరణానికి, ఆస్తుల విధ్వంసానికి కారణమైతే, ప్రజా స్వామం ముగిసిపోతోందనడానికి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. చెలరేగిన ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితితో పాటు, పరిస్థితిని అదుపు చేసేందుకు తీసుకుంటున్నచర్యలపై నివేదక ఇవ్వాలని ఆదేశించినా రాష్ట్ర పోలీసులు నివేదిక ఇవ్వలేద’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos