దేవాస్ కు విజయం

దేవాస్ కు విజయం

వాషింగ్టన్ : ఇస్రో భాగస్వామి ఆంత్రిక్స్ సంస్థపై దేవాస్ మల్టీ మీడియా లిమిటెడ్ ఎట్టకేలకు విజయాన్ని సాధించింది. 2005 లో ఉపగ్రహాల ఒప్పందం రద్దు చేసుకున్నందుకు గానూ 1.2 బిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని అమెరికా న్యాయస్థానం ఆంత్రిక్స్ను ఆదేశించింది. 2005 జనవరిలో రెండు శాటిలైట్ల తయారీ, ప్రయోగాలకు ఆంత్రిక్స్, దేవాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2011 ఫిబ్రవరిలో దేవాస్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆంత్రిక్స్ ప్రకటించింది. దీంతో దేవాస్ న్యాయ పోరాటం మొదలుపెట్టింది. అత్యున్నత న్యాయస్థానం న్యాయ పంచయతి ఏర్పాటుకు ఆదేశించింది. దరిమిలా 2018 సెప్టెంబర్లో అమెరికన్ దేవాస్ కోర్టును ఆశ్రయించింది. వాషింగ్టన్ న్యాయస్థానం ఈ నెల అక్టోబర్ 27న కేసుపై విచారణ జరిపి తుది తీర్పును వెలువరించింది. ఆంత్రిక్స్ కార్పోరేషన్ దేవాస్ మల్టీమీడియాకు 562.5 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని, వడ్డీతో కలిపి 1.2 బిలియన్ డాలర్ల చెల్లించాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos