నేడు రెడ్‌ బుక్స్‌ డే

నేడు రెడ్‌ బుక్స్‌ డే

విజయవాడ: చరిత్ర గతిని మార్చిన రోజు ఇది. మొట్టమొదటిసారి శ్రమజీవుల కష్టాలకు, కన్నీళ్లకు కారణాలను, వాటికి పరిష్కారాలను శాస్త్రీయంగా చెప్పిన దినమిది. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంకెళ్ళు తప్ప… ప్రపంచకార్మికులారా ఏకం కండి’ అంటూ గర్జించిన రోజు. కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడి నేటికి (ఫిబ్రవరి 21) 172 సంవత్సరాలు. సమత, మమతలతో నిండిన మరోప్రపంచానికి మార్గం చూపిన ఈ దినాన్ని రెడ్బుక్స్డేగా ఇక మీదట నిర్వహించనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో లక్షమందికి కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాన్ని అందించాలని వామపక్షపార్టీలు, సంస్థలు నిర్ణయించాయి. ఐదు వామపక్ష ప్రచురణ సంస్థలు ఉమ్మడిగా లక్ష ప్రతులను ముద్రించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos