ఫేస్​బుక్​, వాట్సాప్ ​పై దర్యాప్తుకు డిమాండ్

ఫేస్​బుక్​, వాట్సాప్ ​పై దర్యాప్తుకు డిమాండ్

న్యూ ఢిల్లీ : భారత్లో ఫేస్బుక్, వాట్సాప్ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని వ్యాఖ్యానించారు. ‘భారత ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యంపై ఫేస్బుక్, వాట్సాప్ దాడి చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. దేశ వ్యవహారాల్లో విదేశీ సంస్థయినా, ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకునేందుకు వీలులేదు. వారిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలి. తప్పు చేసినట్లు గుర్తిస్తే శిక్షించాలి’అని రాహుల్ గాంధీ ట్వీట్ లో డిమాండు చేసారు. ‘భాజపా-వాట్సాప్ ఒప్పందాన్ని అమెరికా టైమ్ మాగజైన్ బయటపెట్టింది. భారత్లో 40 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. ఇక్కడ తన పేమెంట్ సేవల ప్రారంభించేందుకు మోదీ ప్రభుత్వం సాయం వాట్సాప్నకు అవసరం. అలా వాట్సాప్పై భాజపాకు పట్టు లభించింది’ అని రాహుల్ ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos