దేశంలో అత్యంత భారీ జరిమానా..

దేశంలో అత్యంత భారీ జరిమానా..

ఈనెల 1వ తేదీ నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చాక భారీ జరిమానాలతో పోలీసులు వాహనదారుల వీపు విమానం మోత మోగిస్తున్నారు.భారీ జరిమానాలపై సామాజిక మాధ్యమాల్లో సరదా మీమ్స్‌ పాటు చర్చలు కూడా జరుగుతున్నాయి.తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్‌కు ఢిల్లీ పోలీసులు దేశంలోనే అత్యంత భారీ జరిమానా విధించారు. హర్యాణ రాష్ట్రానికి చెందిన ఓ ట్రక్కు డ్రైవర్‌కు రూ.2.05లక్షల జరిమానా విధించడం సంచలనంగా మారింది. రవాణా శాఖకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్ జీటీ కర్నాల్ రోడ్డు వద్ద నిలిపి భారీ జరిమానా విధించినట్లు ఢిల్లీ రవాణాశాఖా కార్యాలయం తెలిపింది.డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ టెస్టు, ఇన్ష్యూరెన్స్, పర్మిట్, సీటుబెల్టు ధరించకపోవడంతో ఈ స్థాయిలో భారీ జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా పరిమితికంటే అదనంగా లోడు ఈ ట్రక్కులో తీసుకెళుతుండంతో అదనంగా రూ. 36వేలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.మొత్తం జరిమానా రోహిణీ కోర్టులో చెల్లించినట్లు అధికారులు తెలిపారు.అంతకుముందు రాజస్థాన్‌కు చెందిన ట్రక్కు పై రవాణాశాఖా అధికారులు రూ.1.41 లక్షలు ఓవర్‌ లోడింగ్‌కు జరిమానా విధించారు.ట్రాఫిక్ నిబంధనల పేరుతో పోలీసులు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తుండడంతో జరిమానాలకు భయపడి వాహనదారులు తమ వాహనాలను ఇంటివద్దే వదిలి రోడ్డుపైకొస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos