కంగారుతో సుమ..

కంగారుతో సుమ..

టాలీవుడ్‌ నటుడు రాజీవ్‌ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నాక పూర్తిస్థాయిలో
తెలుగు అమ్మాయిగా మారిన సుమ కనకాల అంటే బుల్లితెరతో పాటు తెలుగు చిత్ర రంగంలో కూడా
ప్రత్యేక అభిమానం చూపుతారు.తమ పంచ్‌లతో కామెడీ టైమింగ్‌తో ఎటువంటి కార్యక్రమంలోనైనా
జోష్‌ నింపగల ప్రతిభపాటవాలు సుమ సొంతం.అందుకే బుల్లితెరపై సుమ చేసే ఏ ప్రోగ్రామ్‌కైనా
అభిమానులు భారీగా ఉంటారు.టీఆర్‌పీ రేటింగ్‌లు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉంటాయి.అటువంటి
సుమ తాజాగా మరోసారి బుల్లితెరపై చిన్నపాటి సంచలనం సృష్టించింది.ఆస్ట్రలియా క్రికెట్‌
జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.సుమ
కూడా కొద్ది కాలంగా తెనాలి డబుల్‌ హార్స్‌ మినప గుండ్లు ప్రకటనలో నటిస్తున్నారు.ఈ క్రమంలో
తాజాగా ఐపీఎల్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన వార్నర్‌తో సుమ మినప గుండ్లు వాణిజ్య ప్రకటన
కోసం బుల్లితెర స్క్రీన్‌ పంచుకున్నారు.ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీల పుణ్యమా అని ఈ క్రికెటర్లు స్టార్లతో చెట్టాపట్టాల్ అంటూ వాణిజ్య ప్రకటనల్లో నటించేస్తున్నారు. తద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ ప్రకటనల్లో నటించినందుకు వార్నర్ ఎంత తీసుకుంటున్నాడో? మరి యాంకర్ సుమ ఎంత పెద్ద మొత్తం ఛార్జ్ చేశారో తెలియాల్సి ఉందింకా. ప్రస్తుతం ఈ అరుదైన ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos