కూతురుతో హైదరాబాద్‌ రోడ్లపై డేవిడ్‌ వార్నర్‌ చక్కర్లు..

  • In Sports
  • April 12, 2019
  • 133 Views
కూతురుతో హైదరాబాద్‌ రోడ్లపై డేవిడ్‌ వార్నర్‌ చక్కర్లు..

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని ఏడాదిపాటు నిషేధానికి గురి కావడంతో గత ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ నిషేధిత అవధి పూర్తి కావడంతో ఈఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.ఆదివారం హైదరాబాద్‌లో ఢిల్లీతో మ్యాచ్‌ ఉండడంతో సాధన కోసం సనరైజర్స్‌ జట్టు హైదరాబాద్‌లోనే ఉంది.ఈ క్రమంలో డేవిడ్‌ వార్నర్‌ తన కూతురుతో కలసి హైదరాబాద్‌ నగరం రోడ్లపై ఆటోలో చక్కర్లు కొట్టాడు.ఈ వీడియోను సన్‌రైజర్స్‌ జట్టు యజమాన్యం హైదరాబాద్‌లో ఎవరు విహరిస్తున్నారో చూడండంటూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్‌ చేసింది.దీంతో వీడియో చూసిన హైదరాబాద్‌ అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos