అత్యున్నత న్యాయస్థానం ఎదుట మహిళా సంఘాల ధర్నా

అత్యున్నత న్యాయస్థానం ఎదుట   మహిళా సంఘాల ధర్నా

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ని అంతర్గత విచారణ సమితి నిర్ధోషిగా తేల్చి నందుకు న్యాయ వాదులు, మహిళా సంఘాల కార్యకర్తలు మంగళవారం ఇక్కడ అత్యున్నత న్యాయస్థానం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవాంఛనీయాల్ని నివారించేందుకు అత్యున్నత న్యాయస్థానం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు. ధర్నా ప్రారంభం కాగానే పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి దూరంగా లాక్కెళ్లిపోయారు. న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ప్రకారం ఆంక్షల్ని విధించారు. ‘‘న్యాయవ్యవస్థ ప్రమాదంలో’’ పడిందనేందుకు అంతర్గత సమితి సిఫార్సు నిదర్శనమని ఆందోళన కారులు విమర్శించారు. ‘మహిళలు తమ హక్కుల కోసం ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. అత్యున్నత న్యాయస్థానం సమితి టీ అన్ని నిబంధలను ఉల్లంఘించింది. పారదర్శక విచారణ కోసం మేము డిమాండ్ చేస్తున్నామ’ని మహిళా కార్యకర్త అన్నే రాజా పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ‘అత్యున్నత న్యాయస్థానమే బంధనలను ఉల్లంఘిస్తే ఇక న్యాయ వ్యవస్థకు విలువేముంటుంద’ని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos