ప్రైవేట్ ఆసుపత్రి దాష్టీకం..

ప్రైవేట్ ఆసుపత్రి దాష్టీకం..

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. మొదటగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా వైరస్ కు చికిత్స అందించారు. కానీ ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స అందించినందుకు బిల్లులు ఇబ్బడి ముబ్బడిగా దండుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ కరోనా రోగికి 10 రోజులు చికిత్స చేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతనికి చికిత్స అందించినందుకు ఆస్పత్రి యాజమాన్యం రూ.17. 5 లక్షల బిల్లు వేసింది. అప్పటికే కొంత బిల్లు చెల్లించారు. కానీ మరో 8 లక్షల బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని కుటుంబ సబ్యులని బెదిరిస్తున్నారు.కరోనాతో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి 10 రోజుల క్రితం సోమజిగూడా డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరాడు. అయితే అక్కడ ఒక్క రోజుకి లక్షకి పైగా వసూళ్లు చేసింది డెక్కన్ ఆసుపత్రి యాజమాన్యం. 10 రోజులకు 17.5 లక్షల బిల్లు వేశారు. అందులో రూ.8 లక్షలు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కట్టారు.అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ రెడ్డి భార్య నిన్న కరోనాతో మృతి చెందింది. ఈ విషయం తెలియడం తో సత్యనారాయణరెడ్డి కూడా నిన్న మృతి చెందాడు. అయితే మరో 8లక్షలు కడితేనే సత్యనారాయణ మృతదేహం ఇస్తామని ఆసుపత్రి మ్యానేజ్మెంట్ సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. మూడు రోజుల క్రితం సత్యనారాయణ రెడ్డి అన్న కొడుకు హరీష్ కూడా కరోనా తో మృతి చెందాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos