యజమాని ఎత్తుకు పనివాడి పైఎత్తు..

యజమాని ఎత్తుకు పనివాడి పైఎత్తు..

గుడిని మింగేవాడు ఉంటే గుళ్లో లింగాన్ని సైతం మింగేవాడు ఒకడుంటానే నానుడిని నిజం చేసేలా ఒంగోలులో వెలుగు చూసింది.ఓ డెయిరీ ఫాం యజమాని అతితెలివిని పసిగట్టిన పనివాడు చాకచక్యంగా యజమానికి కుచ్చుటోపీ పెట్టాడు.ఒంగోలులో డెయిరీ ఫాం నడుపుతున్న బిలాల్ అనే వ్యక్తి విశాఖపట్టణానికి చెందిన మరో వ్యక్తితో కలసి గాంధీరోడ్డులో మరో డెయిరీ ఫాం ప్రారంభించాడు.అందులో గేదెల కొనుగోలు కోసం భాగస్వామిని రూ.20లక్షల పంపాల్సిందిగా సూచించాడు.అయితే డబ్బును బ్యాంకు ఖాతాలో కాకుండా ఓ అట్టపెట్టేలో సరుకుల్లా పెట్టి పార్కిల్ చేసి ట్రావెల్ బస్సుకు అందించాలని సూచించాడు.బిలాల్ చెప్పినట్టే విశాఖ భాగస్వామి రూ.20 లక్షలు అట్టపెట్టెలో పార్సిల్ చేసి ఈనెల ఒకటిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అందించాడు.అయితే విశాఖ భాగస్వామికి తన యజమాని సెల్ఫోన్లో చెబుతున్న ఈ విషయాలను జాగ్రత్తగా విన్న విజయవాడకు చెందిన శ్రీరామ్ అనే పనివాడు యజమాని అతితెలిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పథకం వేశాడు.కాగా రెండో తేదీన ఈ బస్సు ఒంగోలు చేరాల్సిన బస్సు రాకపోవడంతో ట్రావెల్ సంస్థకు బిలాల్ తన సహాయకుడు శ్రీరామ్తో కలిసి వెళ్లి ఆరాతీశాడు. అనివార్య కారణాల వల్ల బస్సు రద్దయిందని, రేపు వస్తుందని కార్యాలయం సిబ్బంది చెబుతూ బస్సు డ్రైవర్ నంబర్ను బిలాల్కు ఇచ్చారు. ఈ నంబర్ను జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్న శ్రీరామ్ మరునాడు తెల్లవారు జామున ఐదు గంటలకే ఒంగోలు బస్టాండ్కు చేరుకున్నాడు.బస్సు 5.30 గంటలకు రాగానే బస్సు డ్రైవర్కు తన యజమాని నంబర్ చెప్పాడు. బిలాల్ తన ప్రతినిధిని పంపాడని భావించి డ్రైవర్ ఆ పార్సిల్‌ను శ్రీరాంకు ఇచ్చేశాడు. ఈ విషయం తెలియని బిలాల్ ఉదయాన్నే ఒంగోలు ట్రావెల్ ఆఫీస్‌కు వచ్చి పార్సిల్ కోసం ఆరాతీశాడు. అక్కడి సిబ్బంది తెల్లవారు జామునే పార్సిల్ ఇచ్చేసిన విషయం తెలియడంతో కంగుతిన్నాడు.పార్సిల్లో రూ.20 లక్షల నగదు ఉందని చెప్పడంతో కార్యాలయం సిబ్బంది కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే బిలాల్ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి పేరు శ్రీరామ్ అని, అతనిది విజయవాడ అని మాత్రమే తెలుసని, అంతకు మించి వివరాలు తెలియవని పోలీసులకు చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos