హిందువు కాదని ఆహారం వద్దన్నాడు..

హిందువు కాదని ఆహారం వద్దన్నాడు..

ప్రస్తుత ఆధునిక కాలంలో కులమతాల విబేధాలు క్రమక్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.మారు మూల ప్రాంతాల్లో అప్పడప్పుడూ కనిపించే ఈ జాఢ్యం ప్రస్తుతం ఉన్నత విద్యావంతులు,ఇంజనీర్లు ఉంటున్న మెట్రో నగరాల్లో కనిపిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.కొద్ది రోజుల క్రితం హిందూయేతర వ్యక్తి తమ ఇంట్లో చెడిపోయిన యంత్రానికి మరమ్మత్తులు చేయడానికి వచ్చాడని మరమ్మత్తులు చేయించుకోవడానికి మహిళ నిరాకరించిన విషయం తెలిసిందే.తాజాగా ఢిల్లీలో కూడా ఇటువంటి ఘటనే వెలుగు చూసింది.ఢిల్లీలో ఉంటున్న అమిత్ శుక్లా అనే వ్యక్తి జొమాటోలో ఫుడ్ డెలివరీ చేశాడు.కొద్ది సేపటి అనంతరం డెలివరీ బాయ్‌ ఆహారాన్ని తీసుకురాగా ఆహారాన్ని తీసుకోవడానికి శుక్లాకు మతం అడ్డొచ్చింది. డెలివరీ బాయ్ తమ మతం కాదని వింత కారణం చెప్పాడు. అంతేకాదు తాను చేసిన ఘనకార్యాన్ని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి జొమాటో తీవ్రంగానే స్పందించింది. తమకు కుల, మత పట్టింపులు లేవని స్పష్టంచేసింది. మీకు ఆహారం వద్దంటే క్యాన్సిల్ చేయండి, రీ ఫండ్ మాత్రం ఇవ్వబోమని తేల్చిచెప్పింది. మత ఛాందసవాది అయిన శుక్లా ఆర్డర్ క్యాన్సిల్ చేసి .. తన మత ఛాందస వాదాన్ని నిరూపించుకున్నాడు. తనకు రీ ఫండ్ కూడా వద్దని చెప్తూ తాను బుక్ చేసిన ఆహారాన్ని తీసుకోకుండా క్యాన్సిల్ చేశాడు. దీనిపై జొమాటో స్పందిస్తూ .. ఆహారానికి మతం లేదని, మీకు తెలిసి కుల, మతాలు ఉన్నాయా అని శుక్లాను ప్రశ్నించింది. అంతేకాదు జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ జోయల్ కూడా రియాక్టరయ్యారు. ‘మేం భారతదేశ వారసత్వ సంపదకు వారసులైనందుకు గర్వంగా భావిస్తున్నాం, అంతేకాదు తమ వినియోగదారులు, భాగస్వాముల సహకారంతో జొమాటో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా తమ వ్యాపార సంస్థను పెంచుకునేందుకు మాత్రం విలువలకు కట్టుబడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో విలువలకు తిలోదకాలివ్వం.. తమ వ్యాపారంలో నష్టమొచ్చినా ఫరావాలేదు అని ట్వీట్ చేశారు.జొమాటో రియక్షన్‌ను నెటిజన్లు ఫిదా అయిపోయారు.జొమాటో చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో తెగ ట్రోలవుతుంది. ఇప్పటికే 800 మంది రీ ట్వీట్ చేయగా .. 15 వేలకు పైగా లైకులు వచ్చాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos