కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ ఖరీదైన ఆటగాళ్లు

కమిన్స్, మ్యాక్స్‌వెల్‌ ఖరీదైన ఆటగాళ్లు

కోల్‌కతా : ఐపీఎల్‌ 2020 వేలంలో అమ్ముడుపోయిన 10 మంది ఆటగాళ్లలో ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ అత్యధిక ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్ అతడిని రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. అతడి తర్వాత ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రెండో అత్యధిక ధర పలికాడు. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ అతడి కోసం రూ.10.75 కోట్లు వెచ్చించింది. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌మోరిస్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.10 కోట్లకు తీసుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఇంగ్లాండ్‌ పేసర్‌ సామ్‌ కరన్‌ను 5.50 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను కోల్‌కతా రూ.5.25 కోట్లకు చేజిక్కించుకుంది. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ను ఆర్‌సీబీ రూ.4.40 కోట్లకుతీసుకుంది. భారత ఆటగాళ్లలో రాబిన్‌ ఉతప్ప రూ.3 కోట్ల ధర పలికాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని తీసుకుంది. ముంబయి ఇండియన్స్‌ క్రిస్‌లిన్‌ను రూ.2 కోట్లకు తీసుకోగా, దిల్లీ క్యాపిటల్స్‌ జేసన్‌ రాయ్‌, క్రిస్‌వోక్స్‌ను చెరో రూ.1.5 కోట్లకు చేజిక్కించుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా పాట్‌ కమిన్స్‌ (15.50 కోట్లకు) చరిత్ర సృష్టించాడు.2017లో రైసింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ బెన్‌స్టోక్స్‌ను అత్యధిక ధర రూ.14.50 కోట్లకు కొనుగోలు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos