పరిపాలనశాఖలో ఐఏఎస్‌ల మధ్య లొల్లి..

పరిపాలనశాఖలో ఐఏఎస్‌ల మధ్య లొల్లి..

రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కార్యదర్శికి నోటీసులు ఇవ్వటం పరిపాలనశాఖలో కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎటువంటి సమాచారం లేకుండా.. సర్వీస్ రూల్స్ మార్పులు- చేర్పులకు సంభందించిన విషయంలో ఏలాంటి ఫైల్ రన్ చేయకుండానే సచివాలయం సర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ముఖ్యమంత్రి కార్యదర్శితో పాటుగా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు.మంత్రిమండలి ఆమోదం లేకుండా.. ప్రవీణ్ ప్రకాశ్ ఏ విధంగా జీవో జారీ చేస్తారని ఉన్నతాధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగడంతో ఈ మొత్తం వ్యహారంపై వివరణ కోరుతూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నేరుగా ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు.మరోవైపు పరిపాలనా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌పై అదనపు కార్యదర్శి గురుమూర్తి తాజాగా ఫిర్యాదు చేశారు. తమకు ఏ రోజు సరైన సమాచారం ఇవ్వరని.. ఏదైనా పొరపాటు జరిగినా.. ఫెయిల్యూర్ అయినా తమదే అంతా తప్పని తమ మీద తోసేస్తుంటారన్నారు. తమను అదే పనిగా అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.సహచర ఉద్యోగుల ముందు తమను ఎల్లప్పుడూ కించపరిచేలా మాట్లాడుతున్నట్లు చెప్పిన వైనం సంచలనంగా మారింది. తాను 24 ఏళ్లుగా సర్వీసులో ఉన్నానని.. 1993లో సివిల్స్ లో తాను ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. ఆయన దగ్గర పని చేయటం చాలా కష్టంగా ఉంది.. దయచేసి నన్ను వేరే శాఖకు బదిలీ చేయాలంటూ గురుమూర్తి రాసిన లేఖ బయటకు వచ్చి సంచలనంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఐఏఎస్ ల మధ్య నెలకొన్న విభేదాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఒక కన్నేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos