ఖాకీల ఎదుటే క్రౌర్యం

ఖాకీల ఎదుటే క్రౌర్యం

న్యూఢిల్లీ : ఇక్కడి జవాహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం ఆవరణలోని విద్యార్థి వసతి గృహాలపై ఆదివారం తమ సమక్షంలోనే దుండగులు దాడి చేసినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని సంబంధిత ప్రాథమిక సమాచార నివేదిక తేట తెల్లంచేసింది. దుండగులలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నించ లేదు. దాడి గురించి ఢిల్లీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తుల పేరిట హిందీలో ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. దీని ప్రకారం.. పెరియార్ హాస్టల్ వద్ద కొందరు విద్యార్థులు గుమిగూడి ఇతరులు కొట్టి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆదివారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో పరిపాలన విభాగం వద్ద పోలీసు సబ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. వసంత్కుంజ్ ఉత్తర పోలీసు ఠాణా సబ్ ఇన్స్పెక్టర్ కొందరు జవాన్లు పెరియార్ హాస్టల్ వద్దకు వెళ్లినపుడు అక్కడ 50–60 మంది ముసు గులు ధరించి కర్రలతో విద్యార్థులను కొడుతూ కనిపించారు. పోలీసులను చూడగానే వారు అక్కడి నుంచి పారి పోయారు. సాయంత్రం ఏడు గంటలకు సబర్మతి హాస్టల్లోకి కొంత మంది దుండగులు ప్రవేశించి కొడుతున్నారని పోలీసు ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన వెంటనే సిబ్బందితో సబర్మతి హాస్టల్కు వెళ్లారు. అక్కడ 50–60 మంది ముసుగులు ధరించి వ్యక్తులు కర్రలతో విద్యార్థులను బాదడం కనిపించింది. వారిని మైకులో హెచ్చరించడంతో ఎక్కడి వారక్కడ వెళ్లిపోయారు. గత ఆదివారం 3.45 గంటల ప్రాంతంలోనే 50–60 మంది ముసుగు దుండగులను చూసినప్పుడు వారు ఎందుకు స్పందించ లేదు? సాయంత్రం కూడా వారు మళ్లీ కనిపించి నప్పుడు వారిలో ఒక్కరిని కూడా పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించ లేదు? మొదట్లోనే అదనపు బలగాల కోసం వారు ఎందుకు కోరలేదు? దుండగులు 3.45 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు స్వైర విహారం చేసిన క్యాంపస్ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేదు? అస్తులు దాడి జరిగినప్పుడు క్యాంపస్లో ఎంత మంది పోలీసులు ఉన్నా రు? అదనపు బలగాల్లో ఎంత మంది, ఎప్పుడు వచ్చారు? ప్రస్తుతానికి సమాధా నంలేని ప్రశ్నలు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos