పుట్టగొడుగుల్లా టపాసుల దుకాణాలు

పుట్టగొడుగుల్లా టపాసుల దుకాణాలు

హొసూరు : తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో పుట్టగొడుగుల్లా వెలసిన టపాసుల దుకాణాలలో వాన దెబ్బకు వ్యాపారం మందగించింది. జూజువాడి సమీపంలో దీపావళిని పురస్కరించుకొని ఏటా వందల సంఖ్యలో టపాసుల దుకాణాలు వెలుస్తాయి. ఈ దుకాణాలలో బెంగళూరు నుంచి ఎక్కువగా వచ్చి టపాసులు కొనుగోలు చేస్తారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు టపాసుల వ్యాపారం మందగించింది. గత మూడు రోజులుగా హొసూరు ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా దుకాణాలు వెలవెలబోతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హొసూరులో వర్షం లేకపోవడంతో టపాసుల వ్యాపారం ఊపందుకున్నా సాయంత్రం వర్షం కురవడంతో వ్యాపారుల ఆశలు అడియాసలయ్యాయి. వర్షం వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతినిందని వ్యాపారులు వాపోయారు. దీపావళి పండుగకు కేవలం మూడు రోజులే ఉన్నందున వర్షం పడకపోతే వ్యాపారం ఊపందుకుంటుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos