మందుల కొనుగోల్లో అవినీతి

మందుల కొనుగోల్లో అవినీతి

హైదరాబాద్: ఉద్యోగులు, పాత్రికీయుల కోసం ప్రవేశ పెట్టిన పథకాల్లో అక్రమాలు జరిగినట్లు సీపీఎం నేతలు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్కు గురువారం ఇక్కడ ఫిర్యాదు చేశారు. వెల్నెస్ కేంద్రాల మందుల కొనుగోల్లో అవకతవకలు జరిగాయని సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపిం చా రు. 2016-2018 వ్యవధిలో ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ముఖ్యకార్యనిర్వహణాధికారి పద్మ సుమారు రూ. 20 కోట్ల విలువైన మందుల్ని 19 సంస్థల నుంచి నియమావళికి వ్యతిరేకంగా కొన్నారని తప్పుబట్టారు. దీనిపై ఆరోగ్యశ్రీ ట్రస్టు బోర్డు వైద్యారోగ్య శాఖకు నివేదిక సమర్పించి 20 నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos