వైఎస్ జగన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

వైఎస్ జగన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.మాట్లాడుతున్న సమయంలో ప్రసంగానికి అడ్డుపడ్డారనే కారణంగా మేము 150 మంది ఉన్నామని మేం తలుచుకుంటే సభలో ఒక్క తెదేపా సభ్యుడు కూడా ఉండడంటూ వ్యాఖ్యానించడాన్ని నారాయణ తప్పుబట్టారు.మేము 151 మంది సభ్యులున్నాం. మేమంతా లేస్తే మీ 23 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో నిలవగలరా? అత్యున్నత శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు టీడీపీని ఉద్దేశించి ఇలా మాట్లాడారు. సభలో ఉన్న టీడీపీ 23 మంది శాసనసభ్యులకే రక్షణ లేకపోతేఅంతకన్నా తక్కువ మంది శాసనసభ్యులు ఉన్న ప్రతిపక్షాలపై చట్టసభల్లో అప్రకటిత నిషేధమేనా?’ అంటూ నారాయణ ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు.ఇది ఒక్క నారాయణ అడుగుతున్న ప్రశ్నే కాదు రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్న.సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే మరీ ఇంత దౌర్జన్యమా?మేం తలచుకుంటే సభలో ఒక్కరు కూడా ఉండరంటే అర్థమేంటి?భౌతికదాడులకు దిగుతామనా లేక మేమేం చేసినా ఏం మాట్లాడినా అడ్డుపడొద్దంటూ హెచ్చరిస్తున్నామనా?ప్రశ్నించే ప్రతిపక్ష నేతలనే ఇలా బెదిరిస్తే ఇక నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రశ్నించే ప్రజలకు రక్షణ ఉంటుందా?స్వయంగా ఒక ముఖ్యమంత్రే మేం తలచుకుంటే ఒక్కరు కూడా ఉండరని వ్యాఖ్యానిస్తే ఇక ఎమ్మెల్యేలు,గ్రామాల్లో కార్యకర్తలు ఆగుతారా?ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య,శాంతియుత పాలన?ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం?అనే ప్రశ్నలు ప్రజల్లో ఉదయిస్తున్నాయి.జగన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో పాలన ఎలా ఉండబోతుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos