ఇళ్ల పట్టాల కోసం సీపీఐ ఆందోళన

ఇళ్ల పట్టాల కోసం సీపీఐ ఆందోళన

హొసూరు : కృష్ణగిరి జిల్లా డెంకణీకోట ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకొని ఏళ్ళ తరబడి నివాసముంటున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ కార్యకర్తలు డెంకణీకోట తాలూకాఫీసు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. డెంకణీకోట ప్రాంతంలో పేదలు ప్రభుత్వ స్థలాలలో ఇళ్ళు నిర్మించుకుని నివాసముంటున్నారు. వీరికి పట్టాలు మంజూరు చేయాలని పలుమార్లు వివిధ రాజకీయ పార్టీలలు అధికారులను కోరినా స్పందించకపోవడంతో తళి మాజీ ఎమ్మెల్యే రామచంద్రన్ నేతృత్వంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రామచంద్రన్ తాలూకాఫీసులో బైఠాయించి అధికారుల చర్యలను ఖండించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు…పలుకుబడి ఉన్నవారు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా, వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. నిలువ నీడ లేని పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని ఏళ్ల తరబడి నివాసముంటున్నా పట్టాలు ఇవ్వడం లేదని విమర్శించారు. అధికారులు స్పందించి వెంటనే పట్టాలు మంజూరు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos