కొవాగ్జిన్​ ట్రయల్స్​ ను నిలిపేసిన బ్రెజిల్

కొవాగ్జిన్​ ట్రయల్స్​ ను నిలిపేసిన బ్రెజిల్

బ్రసిలియా:కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ను బ్రెజిల్ నిలిపేసింది. ఆ దేశంతో జరిగిన ఒప్పందాన్ని భారత్ బయోటెక్ రద్దు చేయడం ఇందుకు కారణం. భారత్ బయోటెక్ పంపించిన ప్రకటన తర్వాతే ట్రయల్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. బ్రెజిల్ కు చెందిన ప్రెసీసా మెడికమెంటోస్ తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. ‘‘సంస్థతో మేం ఒప్పందం రద్దు చేసుకున్నాం. అయితే, కొవాగ్జిన్ రెగ్యులేటరీ అనుమతుల కోసం అన్వీసాతో కలిసి పనిచేస్తాం’’ అని భారత్ బయోటెక్ వెల్లడించింది. సంస్థతో రద్దయిన ఒప్పందంతో పాటే క్లినికల్ ట్రయల్స్ నూ నిలిపివేస్తూ బ్రెజిల్ నిర్ణయించడం గమనార్హం.వాస్తవానికి 2 కోట్ల మోతాదుల కోసం బ్రెజిల్ తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. ప్రెసీసా అనే సంస్థను ముందుపెట్టి ఆ దేశ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos