పాక్‌కు 58 దేశాలు మద్దతు

పాక్‌కు 58 దేశాలు మద్దతు

ఇస్లామాబాద్: కశ్మీర్ వ్యవహారంలో యాభై ఎనిమిది దేశాలు తమకు అండగా నిలిచాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురు వారం ట్విట్టర్లో వెల్ల డించారు. ‘కశ్మీర్ లో అణచివేత నిలిపి వేయడం, నిర్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షల తొలగింపు, కశ్మీరీల హక్కులను గౌరవించడం, రక్షించడం, భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవడం వంటి అంశాలపై భారత్ తక్షణమే స్పందించాలన్న తమ డిమాండ్ కు ‘సెప్టెం బరు 10న ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో 58 దేశాలు మద్దతుగా నిలిచాయని వివరించారు. భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందాలను అనుసరించి కశ్మీర్ సమస్యను శాంతి యుతంగా పరిష్కరించుకోవాలన్న యూరోపియన్ యూనియన్ (ఈయూ) సూచనను స్వాగతించామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos