వివి పాట్‌ రసీదుల లెక్కింపు పోరు ఆగదు

వివి పాట్‌ రసీదుల లెక్కింపు పోరు ఆగదు

న్యూఢిల్లీ: ‘ఇప్పటితో తమ పోరాటం ఆగదు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంద’ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యాభై 50 శాతం వీవీ ప్యాట్ రశీదుల లెక్కింపు కోసం .విపక్షాల రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించి నందుకు ఈ మేరకు స్పందించారు. చంద్రబాబు నాయుడు మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. యాభై 50 శాతం వీవీ ప్యాట్ రశీదుల లెక్కింపు అనేది న్యాయమైన డిమాండ్ అన్నారు. 21 రాజకీయ పక్షాల నేతలందరమూ మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు.‘ గతంలో బ్యాలెట్ కాగితాల్ని 24 గంటల్లో లెక్కించేవారు. ఇప్పుడు యాభై శాతం రశీదుల లెక్కింపునకు 6 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. సమయం కంటే పారదర్శకత ముఖ్యమని ఎన్నికల సంఘం ఈసీ గుర్తించాలన్నా’రు. రూ.తొమ్మిది వేల కోట్ల వ్యయంతో కొన్న చేసి వీవీ ప్యాట్ల నిష్పాక్షికతపై నేక అనుమానాలు ఉన్నాయన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos