మండలి రద్దుకు మంత్రివర్గం ఆమోదం

మండలి రద్దుకు మంత్రివర్గం ఆమోదం

అమరావతి: శాసనమండలి రద్దు ముసాయిదాను సోమవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. దరిమిలా దాన్ని దిగువ సభలో సోమవారమే ప్రవేశ పెట్టనున్నారు. ఆమోదానంతరం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. గతంలో ప్రధాని మంత్రి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలను ఆధారంగా మండలి రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. శాసన, న్యాయపరంగా ఉన్న చిక్కులను పరిగణించి, ప్రత్యామ్నాయాలనూ గుర్తించింది. శాసన మండలిలోని తొమ్మిది మంది వైకాపా సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉపముఖ్యమంత్రి కాగా మోపిదేవి మంత్రి. వారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నారు. మిగిలిన వారికి వివిధ కార్పోరేషన్లకు ఛైర్మన్ పదవులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos