విలేఖరులకు లంచాలు

విలేఖరులకు లంచాలు

శ్రీనగర్: లడఖ్ లోక్‌సభకు జరుగుతున్న ఎ‍న్నికల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేయాలని కోరుతూ భాజపా నాయకులు తమకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని లేహ్ విలేఖరులు ఆరోపించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరలవుతోంది. ఎన్డీటీవీ ఈ వీడియోను బుధవారం ప్రసారం చేసింది. ‘ఈ నెల 2న ఓ హోటల్‌లో భాజపా నాయకులు విక్రం రంధావా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ రైనా అధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశానికి హాజరయ్యాం. కార్యక్రమం ముగిశాక మేము బయటకు వెళ్తున్న సమయంలో భాజపా నాయకులు మా దగ్గరకు వచ్చారు. నలుగురు విలేఖరులకు కవర్లు  ఇచ్చారు. అనుమానం వచ్చిన రిపోర్టర్లు వాటిని తెరిచి చూడగా దానిలో రూ. 500 నోట్లు ఉన్నాయి. భాజపా నేతల చర్యలకు మేం షాక్‌ అయ్యాం. ఇలా చేయడం తప్పని చెప్పాం’ అని మహిళా జర్నలిస్ట్‌ రించెన్‌ ఆంగ్మో వివరించారు. ‘కేవలం అభిమానంతో దీన్ని ఇస్తున్నాం. ఈ రోజుల్లో ఇదంతా సాధారణమేనని, ఇలాంటివి ప్రతిచోటా జరుగుతాయని మమ్మల్ని బుజ్జగించేందుకు వారు ప్రయత్నించారు. కానీ విలేఖఱులు  ఆ కవర్లను అక్కడే మేజాపై పెట్టి బయటకు వచ్చార’ని రించెన్‌ ఆంగ్మో వివరించారు. తెలిపారు. లడఖ్ లోక్సభ నియోజక వర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా వార్తలు రాయలని భాజపా నేతలు విలేఖరులకు లంచాలవ్వటానికి ప్రయత్నించారని లేహ్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆరోపించింది. భాజపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని పాత్రికీయులు డిమాండ్‌ చేసారు. ఈ ఆరోపణలను భాజపా సీనియర్ నేత ఒకరు ఖండించారు. ‘మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. దాన్ని కవర్‌ చేయడానికి విలేఖరులకు ఆహ్వాన పత్రికల్ని ఇచ్చాం. విలేఖరుల్ని మేం చాలా గౌరవం ఇస్తాం. ఇలాంటి పనుల ఎన్నటికి చేయమని’ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos