కరోనా పరీక్షలు ఎవరెవరు చేయించుకోవాలంటే…

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా..తుమ్మినా భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. ఈనేపథ్యంలో కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచారపత్రాన్ని విడుదల చేసింది.>
గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే.
కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసినా, తిరిగినా వారు కూడా తప్పక పరీక్షలు చేయించుకోవాలి.
వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలి.
ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.
శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, ఇతర తీవ్రమైన వ్యాదులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos