హొసూరు క్వారంటైన్ లోని వారికి కరోనా పరీక్షలు

హొసూరు క్వారంటైన్ లోని వారికి కరోనా పరీక్షలు

హొసూరు : ఇక్కడ క్వారంటైన్‌లో ఉన్న 13 మంది ముస్లింలకు శనివారం కరోనా టెస్టులు నిర్వహించారు.  క్రిష్ణగిరి సమీపంలోని కట్టినాయనపల్లి, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 13 మంది ముస్లిం సోదరులు మార్చి నెల గుజరాత్ లో జరిగిన జమాత్‌కు  వెళ్లారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల గుజరాత్  వెళ్ళిన ముస్లిం సోదరులు క్రిష్ణగిరికి రాలేకపోయారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అధికారులను సంప్రదించి తమిళనాడుకు తమను పంపాల్సిందిగా కోరుకున్నారు. అధికారులు 13 మంది ముస్లింలకు కరోనా టెస్టులు నిర్వహించి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాత వారిని ప్రత్యేక వాహనం ద్వారా తమిళనాడుకు పంపించారు. హొసూరుకు వచ్చిన ముస్లింలను జూజువాడి లోని ఓ కళ్యాణ మండపంలో క్వారంటైన్‌లో ఉంచారు. గత నెల రోజులుగా అధికారుల పర్యవేక్షణలో ఉన్న 13 మంది ముస్లింలకు తిరిగి కరోనా టెస్టులను నిర్వహించి , శాంపిల్స్‌ను పరీక్షకు పంపించారు.  కరోనా లేదని తేలితే వారిని వారి సొంత గ్రామాలకు పంపించనున్నట్లు  హొసూరు వైద్య శాఖ అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos