కోరలు చాస్తున్న కరోనా రక్కసి

కోరలు చాస్తున్న కరోనా రక్కసి

మాడ్రిడ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచంపై తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి మరణించిన వారి సంఖ్య 15,189కి చేరింది. దీనిలో యూరోప్‌కి చెందిన వారే 9,197 మంది ఉన్నారు. అయితే స్పెయిన్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. గత 24 గంట్లలో ప్రపంచ వ్యాప్తంగా 1,395 మంది మహమ్మారికి బలైపోగా.. అందులో 462 మంది స్పెయిన్‌ దేశస్తులే ఉన్నారు. గత 24 గంటల్లో 462 మంది మరణించారని, దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 2,182కి చేరిందని స్పెయిన్‌ వైద్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే ఆ దేశంలో మరణాల సంఖ్య 27 శాతం పెరగడం గమనార్హం. ఆ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 33,089కి చేరింది. ఇటలీ (5,476), చైనా (3,270), స్పెయిన్ (2,182) దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos