తగ్గుతున్న కరోనా వ్యాప్తి తీవ్రత

తగ్గుతున్న కరోనా వ్యాప్తి తీవ్రత

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 8,38,729కి తగ్గింది. అంటే మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 11.69 శాతానికి తగ్గాయి. గత 24 గంటల్లో 77,760 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడు నెలల్లో మొత్తం యాక్టివ్ కేసులు కనుమరుగయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. గత 24 గంటల్లో కొత్తగా 55,342 పాజిటీవ్ కేసులు నమోద య్యాయి. 706 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 71,75,881కి చేరింది. 1,09,856 మంది మరణించారు. కోలుకుని ఇప్పటి వరకు 62,27,296 మంది విడుదలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మరణాల రేటు 1.53 శాతం. కోలుకునేవారి శాతం 86.78కి పెరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos