అత్యాచారం జరిగాక రా..కేసు పెడతాం..

అత్యాచారం జరిగాక రా..కేసు పెడతాం..

హైదరాబాద్‌,ఉన్నావో హత్యాచార ఘటనలపై దేశం అట్టుడుకుతున్న సమయంలో తనపై అత్యాచార యత్నం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెతో ప్రవర్తించిన తీరు మరింత ఆగ్రహ జ్వాలలు రేపుతోంది.ఈ ఘటన సైతం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నావోలోనే చోటు చేసుకోవడం గమనార్హం.అత్యాచార బాధితురాలిని నిందితులు సజీవదహనం చేసిన 36 గంటలు తిరగకుండానే ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.తనను అటకాయించిన కొందరు అత్యాచారం చేయాలని చూశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతి, స్టేషన్ లో తీవ్ర అవమానానికి గురైంది. తాను మందుకు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా ఐదుగురు దారికాసి అత్యాచారం చేయాలని చూశారని చెప్పిన ఆమె ముగ్గురి పేర్లను కూడా చెప్పింది.దీనిపై కేసునమోదుకు అంగీకరించని పోలీసులు, అత్యాచారం జరుగలేదుగా అని అవమానించారు. అత్యాచారం జరిగిన తరువాత రావాలని అప్పుడు కేసు పెడతామని అన్నారని బాధితురాలు వాపోయింది. ఘటన జరిగిన వెంటనే తాను 1090కి ఫోన్ చేస్తే, వారు 100కు కాల్ చేయాలని చెప్పారని 100కు ఫోన్ చేస్తే, ఘటన ఎక్కడైతే జరిగిందో పరిధిలో ఉన్న స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారని ఆమె వెల్లడించింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలుసుకున్న నిందితులు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos