పీవీఆర్‌కు వినియోగదారుల కోర్టు ఝలక్‌..

ప్రేక్షకుల నుంచి వాహనాల పార్కిగ్‌
ఫీజులు వసూలు చేస్తున్న పీవీఆర్‌ మాల్‌ యజమాన్యంపై విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.వాహనాలకు పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నట్లు వ్యక్తి
ఫిర్యాదు చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వినియోగదారుడి నుంచి వసూలు చేసిన
రూ.40 పార్కింగ్‌ రుసుమును తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.దీంతోపాటు ఖర్చుల నిమిత్తం
సదరు వినియోగదారుడికి రూ.5వేలు చెల్లించాలని కూడా న్యాయస్థానం పీవీఆర్‌ మాల్‌ యజమాన్యాన్ని
ఆదేశించింది.చాలా కాలంగా ప్రేక్షకుల నుంచి పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నట్లు గుర్తించిన
న్యాయస్థానం వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ.5లక్షలు చెల్లించాలంటూ పీవీఆర్‌
యజమాన్యాన్ని ఆదేశించింది.ఇకపై హైకోర్టు
ఉత్తర్వుల
మేరకు
మాల్స్‌,
మల్టిప్లెక్స్‌లలో ఉచిత పార్కింగ్‌
కల్పించేలా
చర్యలు
తీసుకోవాలని
మున్సిపల్‌
కమిషనర్‌,
కృష్ణా
జిల్లా
జాయింట్‌
కలెక్టర్‌ను
ఆదేశించింది
కోర్టు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos