చేపలకు సమాధులు..

చేపలకు సమాధులు..

జల, పర్యావరణ కాలుష్యం కారణంగా కొన్ని రకాల జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని, వాటికి కూడా సమాధులు నిర్మించి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన కేరళ రాష్ట్రంలోని పర్యావరణ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. కోజికోడ్ జిల్లా బేపూర్ తీరంలో చేపల కోసం శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. శ్మశానంలో సముద్రగుర్రం, చిలుకచేప, హేమర్ హెడ్ పార్క్, లేథర్ బ్యాగ్ తాబేలు, దుగాంగ్, షాపిష్, ఈగ్రే, జీబ్రాషార్క్, మిస్ కేరళ గౌరవార్థం శ్మశానంలో సమాధులు నిర్మిస్తున్నారు. సమాధులు కూడా ఇనుప చట్రంలో వాడిపారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉంచి నిర్మిస్తున్నారు.దీనివల్ల ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు, అంతరించిపోతున్న జలరాశుల గురించి ఒకేసారి అవగాహన కలిగించినట్టవుతుందని కార్యక్రమాన్ని చేపడుతున్న కోజికోడ్ జిల్లా అధికారులు, బేపూర్ పోర్టు డిపార్ట్ మెంట్ అధికారులు, జెల్లీఫిష్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos