పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి నజర్..

పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి నజర్..

శాసనసభ ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలతో తెలంగాణలో కుదేలైన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించి కొంత బలపడినట్లు కనిపించినా 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోవడంతో అధికారపక్షంలో విలీనమై ఉనికి కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే.తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తుండడంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారింది. మరో వారం రోజుల్లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ స్థానం కోసం అప్పుడే లాబీయింగ్‌లు మొదలయ్యాయి.ఈ క్రమంలో వీలుంటే పీసీసీ చీఫ్‌ పదవి తనకు ఇవ్వాలంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరుతున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను కూడా కలిశానని పీసీసీ చీఫ్ తనకు ఇవ్వాలని కోరినట్లు స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో తన దగ్గర ప్లాన్ ఉందని పద్దతి ప్రకారం వెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు వీడినా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందన్నారు.తనకు రాని పక్షంలో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.ఇకపోతే మరో వారం రోజుల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలం పూర్తవ్వడంతో కొత్తవారిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వారి జాబితాలో జగ్గారెడ్డి కూడా చేరాలనుకుంటున్నారన్నమాట.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos