పేస్ బుక్ పోస్ట్ తో బెంగళూరులో బీభత్సం..

పేస్ బుక్ పోస్ట్ తో బెంగళూరులో బీభత్సం..

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద వివాదానికి కారణం అయింది. తూర్పు బెంగళూరులోని కావల్ బైర్సాండ్రా ప్రాంతంలోని పులకేషినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి బంధువు ఒకరు ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ వివాదానికి కారణమైంది.అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ చూసిన వెంటనే వందలాది మంది ఈ దాడికి పాల్పడ్డారు.అక్కడున్న వాహనాలకు నిప్పంటించడంతో ఎమ్మెల్యే ఇంటికి మంటలు అంటుకున్నాయి. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆందోళనకారులు లోపలికి వెళ్లనివ్వలేదు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఆందోళనను నియంత్రించడానికి ప్రయత్నలు చేయగా పోలీసు వాహనాలకు కూడా నిప్పంటించారు.దీంతో మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ.. వారు అదుపులోకి రాకపోవడంతో నేరుగా కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు.దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు కెజి హళ్లి పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు.బెంగళూరు పోలీసు కమీషనర్ కమల్ కాంత్ మాట్లాడుతూ… కర్ణాటకలోని బెంగళూరులోని డిజె హల్లి & కెజి హల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతాలలో జరిగిన సోషల్ మీడియా పోస్టుపై జరిగిన ఘర్షణల్లో అదనపు పోలీసు కమిషనర్ సహా 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని మీడియాకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos