సీడబ్ల్యూసీ సమావేశాలకు సర్వం సిద్ధం

సీడబ్ల్యూసీ సమావేశాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్: నగరంలో సీడబ్ల్యూసీ సమావేశాలకు టీపీసీసీ సర్వం సిద్ధం చేసింది. హోటల్ తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనుంది. ఈనెల 16, 17 రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చే సభ్యుల కోసం తాజ్ కృష్ణాతో పాటు తాజ్ డెక్కన్, తాజ్ బంజారా, హయత్ ప్లేస్లలో ఉండటానికి ఏర్పాట్లు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చే అతిథులకు తెలంగాణ వంటలతో కూడిన విందును టీపీసీసీ ఇవ్వనుంది. కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జునఖర్గే , సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక రానుండటంతో తో తాజ్ కృష్ణాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 17న సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అనంతరం తుక్కగూడ సభకు నేతలు హాజరుకానున్నారు. ఈసందర్భంగా ఐదు గ్యారెంటీ స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos