బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయాలు మరో కీలక మలుపు తీసుకున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా వర్గీయులైన కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు శనివారం అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. వారికి కాషాయం కండువాలు కప్పి పార్టీలోకి నడ్డా ఆహ్వానించారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.ఇటీవల జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో, ఆయనకు విధేయులుగా ఉంటూ కాంగ్రెస్‌‌పై అసమ్మతి బావుటా ఎగురేసిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కమల్‌నాథ్ సర్కార్ మైనారిటీలో పడిపోయింది. అసెంబ్లీలో బలనిరూపణకు కమల్‌నాథ్‌ను గవర్నర్ ఆదేశించడం, దీనిపై కమల్‌నాథ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అంతిమంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా ప్రభుత్వం బలనిరూపణ చేసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం మధ్యప్రదేశ్ స్పీకర్‌ను ఆదేశించడం వంటి కీలక పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి. బలనిరూపణకు కొద్ది గంటల ముందే కమల్‌నాథ్ రాజీనామా చేశారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos