రాహుల్ వ్యాఖ్యలపై రభస

రాహుల్ వ్యాఖ్యలపై రభస

న్యూ ఢిల్లీ: మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనల గురించి రేప్ ఇన్ ఇండియా అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం లోక్సభలో రభస చెలరేగింది. పాలక పక్ష మహిళా సభ్యులు రాహుల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆక్షేపిం చారు. లోక్సభ సమావేశం ప్రారంభమైన వెంటనే వారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘మేకిన్ ఇండియాను అత్యాచారాలతో పోల్చుతూ ఒక రాజకీయ నేత వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం?’ అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయన్ను శిక్షించాలని డిమాండ్ చేశారు. రాహుల్కు వ్యతిరేకంగా పలువురు మహిళా సభ్యులు నినదించారు. దరిమిలా సభ వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే విషయంపై గందరగోళం నెలకొంది. ‘రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి’ అంటూ కొందరు సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. ‘సభలో లేని వ్యక్తి పేరును చెప్పడం సరికాదు. సభకు ఆటంకం కలిగించొద్దు’ అని సూచించారు. అయినా సభ్యు లు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos