రూ.1.46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్..

రూ.1.46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్..

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.దేశంలో ఆర్ధిక మాంద్యం కారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే వాస్తవిక బడ్జెట్ ను తగ్గించారు. తెలంగాణ రాష్ట్రం 2019-20 బడ్జెట్ 1 లక్ష 46వేల 492 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వాస్తవ అంచనాలతో బడ్జెట్ ను ప్రవశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 1లక్షా82వేల017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెవెన్యూ వ్యయం 1లక్ష 11వేల 055 కోట్లుగా ఉంటుందని అంచాన వేశారు. మూల ధన వ్యయం 17, 274.67 కోట్లుగా అంచాన వేసింది. బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రెండేళ్ల ముందు 4.2 శాతంగా ఉన్న జీఎస్‌డీపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెట్టింపయిందన్నారు.గడచిన ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు.కేవలం ఐదేళ్లలోనే దేశం అద్భుత ప్రగతి సాధించిందని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఏడాది వరకు 19.8 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు 17.5 శాతం మాత్రమే అభివృద్ధి నమోదైంది.గత ఐదేళ్లలో మోటారు వాహనాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 19 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.రాష్ట్రానికి వచ్చే నాన్ ట్యాక్స్ రెవిన్యూ లో కూడ భారీగా తగ్గుదల నమోదైనట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. నాన్ ట్యాక్స్ రెవిన్యూలో గత ఏడాది వరకు 14.9 శాతం సగటు వార్షిక వృద్దిరేటు సాధిస్తే ఈ ఏడాది నాలుగు నెలల్లో మైనస్ 14.16 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. నాన్ ట్యాక్స్ రెవిన్యూ 29 శాతం తగ్గిందని తెలిపారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos