మీరు చెప్పిందే మేము మాట్లాడాలా?

మీరు చెప్పిందే మేము మాట్లాడాలా?

 కొత్త మున్సిపల్‌ చట్టం అమలుకు సంబంధించి నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో రెండవ రోజైన శుక్రవారం బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి ఏదైనా చేద్దామని భావించిన ప్రతిసారి ప్రతిపక్ష నేతలు అడ్డు పడుతున్నారంటూ ఆరోపించారు. చట్టసభల్లో వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామన్నారు. స్థానిక సంస్థల అధికారాలను హరించే ఉద్దేశ్యం తమకు లేదని.. నిధులు ఇచ్చామని, అధికారాలను పెంచామని కేసీఆర్ గుర్తుచేశారు. అయితే కలెక్టర్కు పర్యవేక్షణ పెంచామని తెలిపారు. పంచాయతీరాజ్ మాదిరిగానే మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటుందని.. వాళ్లు వైఖరి మార్చుకోవాలని కేసీఆర్ సూచించారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ వ్యతిరేకించారని అందుకు మేము కూడా వైఎస్‌ఆర్‌పై విమర్శలు చేశామన్నారు.కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను యథాతథంగా అమలు చేశామని గుర్తు చేశారు.దీనిపై స్పందించిన ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కముఖ్యమంత్రి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. సమయంలో కలగజేసుకున్న కేసీఆర్.. మీరు చెప్పిందే.. మేం మాట్లాడాలా అంటూ ఫైరయ్యారు. కొత్త పాలసీ మీకు నచ్చకపోతే వ్యతిరేకించవచ్చని.. ఇందులో తాను తప్పు చెప్పింది ఏం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos