రాజ్యాంగ నైతికతను తిరస్కరించకూడదు

రాజ్యాంగ నైతికతను తిరస్కరించకూడదు

న్యూఢిల్లీ : రాజ్యాంగ నైతికత సిద్ధాంతాన్ని తిరస్కరించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత సామాజిక ఆచరణ పద్ధతుల కారణంగా రాజ్యాంగ నైతికత ఉద్రిక్తతకు లోనవుతోందన్న కారణంతో దానిని తిరస్కరించడం తగని పని అని చెప్పారు. రాజ్యాంగ నైతికత ద్వారా భారతీయ సాంస్కృతిక పద్ధతులను పరిశీలించేటప్పుడు వైరుధ్యాలు తలెత్తే అవకాశంపై అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ కొన్ని రాజ్యాంగ విలువలు ఆమోదయోగ్యమైనవని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు ఇతర దేశాలకు చెందిన రాజ్యాంగాల్లోని కొన్ని నిబంధనల్ని మన పరిస్థితులకు అనువుగా మార్చి భారత రాజ్యాంగంలో చేర్చారని వివరించారు. ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మతం, కులం, జాతి కారణంగా పౌరులపై పెత్తనం చెలాయించేందుకు వీలు లేకుండా సామాజిక ఆచరణ పద్ధతుల్ని సంస్కరించాలని రాజ్యాంగమే చెబుతోందని అన్నారు. అంటరానితనం నిర్మూలన, ప్రభుత్వ విధాన ఆదేశిక సూత్రాలు వంటి అనేక రాజ్యాంగ నిబంధనలు మన దేశంలో అందరికీ ఒకటేనని చంద్రచూడ్ చెప్పారు. ఉచిత న్యాయ సహాయం, పంచాయతీల ద్వారా స్థానిక పాలన, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చట్టాలు చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతూ ఆదేశిక సూత్రాలను రూపొందించారని గుర్తు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos