ప్రేమను నమ్మి వచ్చింది.. జాక్ పాట్ కొట్టింది

ప్రేమను నమ్మి వచ్చింది.. జాక్ పాట్ కొట్టింది

దేనికైనా అదృష్టం ఉండాలి….. తినే మెతుకుపైన కూడా మన పేరు రాసి పెట్టి ఉంటుందని అని పెద్దలు ఊరికినే అనలేదు…… ప్రేమను నమ్మి వచ్చిన ఆ అమ్మాయికి జాక్ పాట్ తగిలింది….. ఏకంగా గ్రామ సర్పంచ్ పీఠం ఎక్కే అదృష్టం వచ్చింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆ గ్రామం ఎస్టీ మహిళ సర్పంచ్‌కు రిజర్వ్ అయ్యింది. అయితే.. ఆ గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడంతో ఆ యువతిని అదృష్టం వరించింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావు పేట మండలంలోని కోటగడ్డ గ్రామానికి చెందిన యువకుడు ననుబోతుల రాజుకుమార్ కు జనగాం జిల్లా తరిగొప్పుల మండలం అంక్షాపూర్ గ్రామానికి చెందిన లల్లితో పరిచయం ఏర్పడింది. గత సంవత్సరం లల్లి వేములవాడ రాజన్న దర్శనానికివెళ్లినప్పుడు రాజ్ కుమార్ తో లల్లికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది… దీంతో..గతేడాది మార్చి 23న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

పెళ్లయ్యాక కోటగడ్డలోని ఓ పూరి గుడిసెలో భార్యభర్తలు కాపురం పెట్టారు. ఇదే సమయంలో కోటగడ్డ నూతన గ్రామపంచాయతీగా ఎన్నికై ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది.అయితే.. ఆ గ్రామంలో ఎస్టీలు ఎవరూ లేకపోవడంతో పాటు లల్లి ఎస్టీ కావడంతో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నిక అయ్యేందుకు అవకాశమొచ్చింది. ప్రేమ వివాహం.. ఆనందంతో పాటు సర్పంచ్ పీఠం ఎక్కే అదృష్టం కూడ ఇచ్చిందని లల్లి మురిసిపోతోంది. గ్రామ పెద్దల సహాకారంతో గ్రామాన్ని అభివృద్ది చేస్తానని అమె తెలిపింది. ఎకగ్రీవ గ్రామాలకు తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. దీంతో ఈ గ్రామానికి కూడా నజరానా దక్కుతుందని.. నజరానాతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్ తో గ్రామాన్ని అభివృద్ది చేయాలని గ్రామస్థులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos