ఎన్నికల్లో కనిపించని తారల తళుకులు

  • In Film
  • March 28, 2019
  • 156 Views
ఎన్నికల్లో కనిపించని తారల తళుకులు

ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌ : ఎన్నికల సీజన్‌ వచ్చిందంటే గతంలో తారల సందడి ఎక్కువగా కనిపించేది. ప్రచారాల్లో సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. తెలుగుదేశానికి తొలి నుంచీ తారల మద్దతు పుష్కలంగా లభించేది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ. రామారావు సినీ రంగం నుంచి రావడమే దీనికి కారణం. రాష్ట్ర విభజన తర్వాత తారల తీరులో మార్పులు చాలా స్పష్టంగా గమనించవచ్చు. సినీ పరిశ్రమకు కార్య స్థానం హైదరాబాద్‌ కావడం, అక్కడ కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సినీ తారలు అమరావతి వైపు చూడడం దాదాపుగా మానుకున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావుల మధ్య సాగుతున్న రాజకీయ సమరం…తారలను తెదేపాకు దాదాపుగా దూరం చేసింది. బాలకృష్ణ తప్ప ఆ పార్టీని సమర్థిస్తున్న వారిలో పెద్ద తారలెవరూ లేరు. ఆయనా ముఖ్యమంత్రికి వియ్యంకుడనే విషయం తెలిసిందే. ఈసారి వైకాపా వైపు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో మొగ్గు చూపించారు. దీనికి పరోక్షంగా కేసీఆర్‌ కూడా కారణమనే వాదనలూ లేకపోలేదు. నటుడు పవన్‌ కళ్యాణ్‌ సారథ్యంలోని జనసేనలో కూడా తారలున్నారు. అయితే వైకాపాతో పోల్చుకుంటే ఆ సంఖ్య చాలా తక్కువ. నంది అవార్డుల ప్రకటన సందర్భంగా అనేక మంది నటీ నటులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అవార్డులకు ఎంపిక పద్ధతిని పలువురు ప్రశ్నించారు. కొందరు నటులైతే తెలుగు దేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

తారల స్వార్థం

        రాజకీయాలు ఎలా
ఉన్నా, మన సినీ తారలు తొలి నుంచీ స్వార్థపరులనే పేరుంది. తమ ఆస్తులను వృద్ధి చేసుకునే
క్రమంలో వారెప్పుడూ ఊసరవెల్లుల్లా రంగులు మారుస్తూ ఉంటారనే విమర్శలూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు జరిగినప్పటికీ,
ప్రముఖ తారలెవ్వరూ దానికి మద్దతు పలికిన పాపాన పోలేదు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌ వైపు
వస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి…అనే దిశగానే వారి ఆలోచనలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos