పాక్‌ గురించి మాట్లాడొద్దు

పాక్‌ గురించి మాట్లాడొద్దు

న్యూఢిల్లీ: కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈ నెల 13, 14లలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో ఏ దేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని మాట్లాడకూడదని భారత్కు చైనా పరోక్షంగా సూచించింది. చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఝాంగ్ హన్హూయ్ సోమ వారం విలేఖ రులతో మాట్లాడారు. ‘ఎస్ఈవో భద్రత, అభివృద్ధి అనే రెండు అంశాల మీద దృష్టి సారించనున్నాం. ఈ సమావేవాన్ని వివిధ దేశాలను ఉద్దేశించి మాట్లాడటానికి నిర్వహించటం లేదు. ప్రధాన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలకు ఇక్కడ పెద్ద పీట వేయనున్నాం’ అని తెలిపారు. ఉగ్ర వాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌ను ఏకాకిగా చేసేందుకు ఎస్ఈవోను వేదిక చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించిన దశలో చైనా ఈ వ్యాఖ్య చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos