కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావ జాలానికి పునాది

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావ జాలానికి పునాది

ఇంఫాల్:మణిపూర్లో జరుగుతున్న 12వ తరగతి పరీక్షల్లో విద్యార్థులను బీజేపీ ఎన్నికల గుర్తు చిత్రీకరించడంతోపాటు దేశ నిర్మాణానికి సంబం ధించి జవాహర్ లాల్ నెహ్రూ వైఫల్యాలు నాలుగింటిని విశ్లేషణాత్మకంగా రాయమని కోరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రశ్నా పత్రం రూపకల్పనలో తమ ప్రమేయం ఏమీ లేదని భాజపా నేతలు తేల్చి చెప్పారు. తయారు చేసిన విద్యా శాఖాధికారులను ప్రశ్నించాలన్నారు. ఈ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది.విద్యార్థుల మనసుల్లో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ భావ జాలాన్ని నింపే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ నేత జైకిషన్ విమర్శించారు.‘భారత్ మే దలీయ వ్యవస్థ’ చాప్టర్ నుంచి ఈ ప్రశ్నను తీసుకున్నట్లు కౌన్సె లింగ్ ఆఫ్ హయ్యర్ సెకెండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎల్ మహేంద్ర వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos